చిరంజీవి బర్త్‌డే.. కామన్ డీపీ లాంఛ్ చేసిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) అంటే ఫ్యాన్స్‌కు పండగల ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా అది వీలుకాదు. అయినా అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డేను ఓ స్థాయిలో సెలబ్రేట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వేడుకలు షురూ చేసిన అభిమానులు. రేపు ఈ సంబరాన్ని రెట్టింపు చేయనున్నారు. ఈ క్రమంలో కామన్ డీపీని విడుదల చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అంటూ తండ్రికి మొదటి విషెస్ చెప్పాడు. చిరంజీవి ఐకానిక్ కారెక్టర్స్‌తో పాటు కొన్ని ఫోటోలు ఉన్నాయి ఈ డీపీలో. కొండను తొలచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి సింహాసనంపై కూర్చున్నారు చిరంజీవి. ఆయన పడిన కష్టన్ని ఈ ఫొటోలో చూపించారు అభిమానులు. అదే విధంగా చిరు పుట్టిన రోజుకు అభిమానులు క్రియేట్ చేసిన ఓ వీడియోను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మెగాస్టార్ కు అడ్వాన్స్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates