HomeTelugu Trendingరీమిక్స్‌ చేయనంటున్న సాయి ధరమ్‌ తేజ్‌

రీమిక్స్‌ చేయనంటున్న సాయి ధరమ్‌ తేజ్‌

9 11
సాయి ధరమ్‌ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..మొన్నటి వరకు ఈ హీరో సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయి తప్ప.. సక్సెస్ చిక్కలేదు. చిత్ర లహరి సినిమా తో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు ఈ హీరో. తాజాగా ప్రతిరోజు పండుగే సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్, పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేయడంలో సాయిAధరం తేజ్ అందవేసిన చేయ్యి.. ఇంటెలిజెంట్ సినిమా కోసం మరోసారి చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ను రీమేక్ చేసేశాడు. మెగా హిట్స్ మాంచి సాంగ్స్ ను ఎంచుకుని రీమిక్స్ లతో అలరిస్తున్న ఈ హీరో. అంతకు ముందు సుప్రీమ్ సినిమా కోసం చిరంజీవి సాంగ్ ను వాడుకున్నాడు. ఇలా ప్రతిసారి చిరంజీవి సాంగ్స్ ను రీమిక్స్ చేసే తేజు ఇకపై నో రీమిక్స్ అంటున్నాడు. చిరు పాటలని రీమిక్స్ చేయడంపై చాలా వరకు విమర్శలు రావడంతో సాయిధరమ్‌తేజ్ ఇక రీమేక్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం `సోలో బ్రతుకే సో బెటర్‌` చిత్రంలో నటిస్తున్నాడు ధరమ్‌ తేజ్‌. ఈ చిత్రాన్ని మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu