మాస్ టైటిల్ తో మెగాహీరో!

‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత దాదాపు ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకున్న దర్శకుడు వి.వి.వినాయక్ త్వరలోనే మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా కోసం ‘దుర్గ’ అనే టైటిల్ ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో.. తెరపై సినిమాను కూడా అదే
రేంజ్ లో వినాయక్ ఆవిష్కరిస్తాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఆకుల శివ ఈ సినిమాకు కథను అందించారు. ఈ సినిమాకి నిర్మాతగా ఠాగూర్ మధు పేరు వినిపించింది గానీ, బడ్జెట్ ఎక్కువవుతుందనే ఆలోచనతో ఆయన తప్పుకున్నాడనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి సి.కల్యాణ్ ముందుకు వచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ ‘జవాన్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెల నుండి వినాయక్ సినిమాను పట్టాలెక్కించనున్నారు.