HomeTelugu Trendingపెళ్లికొడుకు కాబోతున్న సాయి ధరమ్‌ తేజ్‌

పెళ్లికొడుకు కాబోతున్న సాయి ధరమ్‌ తేజ్‌

Sai dharam tej ready for ma
టాలీవుడ్‌లో పెళ్లిల సీజన్‌ నడుస్తుంది. ఇప్పటికే పులువురు యంగ్‌ హీరోలు ఓ ఇంటివారు కాగా.. మెగా డాటర్‌ నిహారిక నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీగా ఉంది. ఇక తాజాగా ఈ లిస్ట్‌లో మరో యంగ్‌ చేరినట్లు తెలుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఇంట్లోవాళ్లు ఫిక్స్‌ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు ఈకుర్ర హీరో. ఏపీకి చెందిన బంధువుల అమ్మాయినే పెళ్లాడబోతునట్లు సమాచారం. సాయి ధరమ్‌ తేజ్ పెళ్లికి ఆయన మేనమామ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. వచ్చే వేసవిలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu