HomeTelugu Trendingతాతయ్య భుజంపై సాయిధరమ్‌ తేజ్‌.. కనువిందు చేస్తోన్న చిరంజీవి తండ్రి ఫొటో

తాతయ్య భుజంపై సాయిధరమ్‌ తేజ్‌.. కనువిందు చేస్తోన్న చిరంజీవి తండ్రి ఫొటో

10 9

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తండ్రి అంటే సాయిధరమ్ తాతయ్య కొణిదెల వెంకట్రావు కూడా ఉన్నారు. అది తేజూ చిన్ననాటి ఫొటో. ఈ ఫొటొలో తాతయ్య భుజంపై టీవీగా కూర్చొని చాలా ధీర్ఘంగా ఏదో చూస్తున్నాడు చిన్నారి తేజూ. ఇక ఆయన తాతయ్య వెంకట్రావుగారు సైతం చేతిలో టీ గ్లాస్ పట్టుకుని ఎవరో చెప్తున్న విషయాలను చాలా సీరియస్‌గా వింటున్నట్టు ఉంది.

ఇంత అందమైన ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతే అందమైన కామెంట్లు వస్తున్నాయి. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత స్పందిస్తూ.. ‘‘చాలా క్యూట్‌గా కనిపిస్తున్నావ్ తేజ్. మన కుటుంబంలోనే అత్యంత అందమైన వ్యక్తి తాతయ్య’’ అని కామెంట్ చేశారు. అలాగే, నిహారిక కూడా ‘సో బ్యూటిఫుల్’ అని కామెంట్ పెట్టారు. సాయితేజ్ హీరోయిన్ రాశీ ఖన్నా సైతం స్పందించారు. ‘‘సో క్యూట్ తేజ్’’ అని కామెంట్ చేశారు. మొత్తం మీద తాతయ్య భుజంపై చిన్నారి తేజ్ మెగా అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu