HomeTelugu Trendingసాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా.. రిలీజైన ఫస్ట్‌లుక్స్‌

సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా.. రిలీజైన ఫస్ట్‌లుక్స్‌

2 8
టాలీవుడ్‌లో ‘ఫిదా’ సినిమా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి. అచ్చ పల్లటూరి అమ్మాయిలా కనిపించి అందరిని ఆకర్షించింది సాయి పల్లవి. ఆ సినిమా తరవాత తెలుగు మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సాయిపల్లవి ప్రస్తుతం దగ్గుబాటి రానా సరసన విరాటపర్వం అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా నుంచి సాయి పల్లవి లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. హీరో రానా తన ట్విట్టర్ వేదికగా ఈ లుక్ ను పోస్ట్ చేశారు. ఈసినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఇక సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భముగా ఆమె లుక్ రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు చిత్రయూనిట్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu