HomeTelugu Trendingసాయిరామ్‌ 'రీసౌండ్‌' షురూ

సాయిరామ్‌ ‘రీసౌండ్‌’ షురూ

Sairam Shankar new movie sh
టాలీవుడ్ నటుడు సాయిరామ్ శంక‌ర్ న‌టిస్తోన్న తాజా సినిమా ‘రీసౌండ్’‌. ఎస్ఎస్ మురళికృష్ణ (డెబ్యూట్ డైరెక్ట‌ర్) ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నఈ అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌లో రాశీ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ ప్రారంభమైంది. లాక్ డౌన్ ముందు 70 శాంత షూటింగ్ పూర్త‌యింది. తాజా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ను మొత్తం పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేశ్ రెడ్డి, అయ్య‌ప్ప రాజు అండ్ రాజా రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కేరాఫ్ కంచెర‌పాలెం ఫేం స్వీక‌ర్ అగ‌స్తి సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టుకొట్టాల‌ని భావిస్తున్నాడు సాయిరాం శంక‌ర్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu