పోసాని కృష్ణమురళీని పరామర్శించిన వైసీపీ నేతల

ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీఅనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళీ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యశోదా ఆస్పత్రికి వెళ్లి.. పోసానిని సజ్జల పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోసానికి అందుతున్న వైద్యం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సజ్జల ఆరా తీశారు.