YSRCP leaders:
YSRCP ఇప్పుడు పవర్ లో లేదు. వైసీపీ ప్రభుత్వం మారిపోయి చాలా కాలం అయిపోయింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం.. ప్రభుత్వం మారింది అన్న విషయం వైసిపి నాయకులు తెలుసా లేదా అని అనుమానాలు కలుగుతున్నాయి. పవర్ లో ఉన్నప్పుడు మాత్రమే కాక.. పవర్ పోయిన తర్వాత కూడా వైసిపి నాయకులు బ్రిటిష్ పరిపాలన పద్ధతినే వాడుతున్నట్టు అనిపిస్తోంది.
పవర్ లో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా.. ప్రజల సొత్తుని కూడా కాల్ చేసి మరీ బ్రిటిష్ వారిలాగా పరిపాలించిన వైసిపి నాయకులు.. ఇప్పుడు పవర్ పోయిన తర్వాత.. బ్రిటిష్ వారు వాడిన డివైడ్ అండ్ కాంకర్ పద్ధతి పాటిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల మధ్య చిచ్చు రాసేసి ఆ మంటలో చలికాచుకుంటున్నారు వైసిపి లీడర్లు
ముఖ్యంగా రాజకీయ, సినీ ప్రముఖుల కుటుంబాల మధ్య విభేదాలను చూపి చలి కాచుకోవడమే వారి ప్రాధాన్యమైన వ్యూహంగా కనిపిస్తుంది. రాజకీయ చర్చల్లో రామోజీ రావు, ఆయన కుమారుడు సుమన్ మధ్య వచ్చిన కొన్ని తగవులను తమ మీడియా ద్వారా పెంచి చూపడంలో వైసీపీ నేతలు, వారికి అనుకూల మీడియా ముందుండి పని చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, వైసీపీ అధినేత జగన్ రెడ్డి మీడియా పత్రికలు, చానళ్ళు రామోజీ కుటుంబ విభేదాలను ప్రజల ముందు అతిగా చూపించాయి.
ఇటీవల, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వివాదాలను సృష్టించేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నాలు చేసింది. పలు సందర్భాల్లో వైసీపీ నేతలు ఈ కుటుంబ విభేదాలను చర్చల్లోకి తీసుకురావడం, జనసేన, మెగాస్టార్ అభిమానుల మధ్య చిచ్చు రాజేయాలని చూస్తున్నట్లు ప్రవర్తించారు.
ఇక తాజాగా అల్లు అర్జున్ అభిమానులను కూడా రెచ్చగొట్టేందుకు వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా హస్తాలు ప్రయత్నిస్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వైసీపీ నేతల టార్గెట్ గా మారినట్లు తెలుస్తుంది. వారి ప్రతిపక్ష కుటుంబాల్లో సమస్యలను సృష్టించి, వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం వైసీపీ డీఎన్ఏలోనే ఉంది అని విమర్శకులు చెబుతున్నారు.