HomeTelugu Trendingప్రభాస్ సలార్ మూవీకి సెన్సార్ 'A' సర్టిఫికెట్

ప్రభాస్ సలార్ మూవీకి సెన్సార్ ‘A’ సర్టిఫికెట్

Salar part 1 sensor

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం స‌లార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానుంది.

సలార్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైల‌ర్ యూట్యూబ్‍లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు సలార్ మూవీ ట్రైల‌ర్ అన్ని భాషల్లో కలిపి150 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

తాజాగా సలార్ మూవీ సెన్సార్ పూర్తయిందని, సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. స‌లార్ మూవీలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు వ‌యోలెన్స్ ఎక్కువ ఉండ‌టంతో A సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. సలార్ మూవీ ర‌న్‌టైమ్ 2 గంట‌ల 55 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

స‌లార్ ట్రైల‌ర్‌కు మిక్స్‌డ్ రివ్యూలు రావ‌డంతో రెండో ట్రైల‌ర్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 16న లేదా 18న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu