HomeTelugu Big Stories'సలార్‌' షూటింగ్‌ వీడియో లీక్‌..

‘సలార్‌’ షూటింగ్‌ వీడియో లీక్‌..

Salaar movie shooting video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‏టైనర్ ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. ‘సలార్’ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే సెట్ లో ప్రభాస్ పై చిత్రీకరిస్తున్న సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి లీక్ అయింది. ప్రభాస్ గ్యాంగ్ తో కలిసి నిల్చొని సీరియస్ గా లుక్ ఇచ్చే సీన్ అది. ఇందులో ఊర మాస్ అవతార్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ‘సలార్’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లీకైన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో విడుదల కానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu