‘రంగస్థలం’తో ‘మహానటి’ పోటీ!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రంగస్థలం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులోనే మార్చి 30న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అదే సమయానికి మహానటి సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత అశ్వనిదత్ ప్రకటించారు.

మహానటి కోసం తెలుగు ప్రేక్షకులు ముఖ్యమా సినీవర్గాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్యదైవం సావిత్రి జీవితంలో అసలేమి జరిగింది, ఆమె చివరి రోజుల్లో ఎటువంటి పరిస్థితులని ఎదుర్కొన్నారు, ఎందుకు ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది అనే విషయాలని తెలుసుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అయితే రంగస్థలం సినిమాకు ఒక్కరోజు ముందుగా మార్చి 29న మహానటి విడుదల కాబోతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలకు పోటీ తప్పదని తెలుస్తోంది. మరి ఈ బరిలో నుండి ఎవరైనా తప్పుకుంటారేమో చూడాలి!