HomeTelugu Big Stories'సలార్‌' ట్రైలర్‌ వచ్చేసింది

‘సలార్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

Salaar trailer out

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్నేహం, రాజకీయం, కుళ్ళు, కుతంత్రాలతో ట్రైలర్ ను నింపేశారు దర్శకుడు. ఈ భారీ ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ను కీలకం గా చూపించారు. అదే విధంగా పృథ్వి రాజ్ మరియు ప్రభాస్ ల స్నేహం ను కూడా బాగానే ఎలివేట్ చేశారు. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu