సౌందర్య పాత్రలో తాప్సీ!

తెలుగులో నాగార్జున, సౌందర్య, రమ్యకృష్ణల కాంబినేషన్ లో గతంలో ‘హలో బ్రదర్’ అనే సినిమా
వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో
డేవిడ్ ధావన్ ఈ చిత్రాన్ని ‘జూద్వా’ అనే పేరుతో తెరకెక్కించారు. హిందీలో కూడా ఈ సినిమా పెద్ద
హిట్ అయింది. ఇప్పుడు డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ ఈ సినిమాను బాలీవుడ్ లో
రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రమ్యకృష్ణ పాత్రకి గాను.. జాక్వాలిన్ ను ఎంపిక చేయగా
సౌందర్య పాత్ర కోసం తాప్సీను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి
వెళ్లనుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో తన క్రేజ్ ను పెంచుకుంటున్న తాప్సీకి ఈ సినిమా గనుక
హిట్ అయితే తన కెరీర్ బాలీవుడ్ లో మరింత పుంజుకోవడం ఖాయం. మరి అమ్మడుకు ఈ సినిమా
ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.. చూడాలి!