HomeTelugu Big Storiesహ్యాపీ బర్త్‌డే సమంత

హ్యాపీ బర్త్‌డే సమంత

Happy birthday Samanthaటాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నేడు (ఏప్రిల్‌28)న ఆమె 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రెటీలతో పాటు అభిమానులు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నారు. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ .. సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సమంత. గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత సమంత పలు సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. వీరి ప్రేమను నాగార్జున అంగీకరించడంతో 2017 వీరి వివాహ బందంతో ఒకటైయ్యారు. పెళ్లి తర్వాత కొందరు హీరోయిన్లు సినిమాలకు దూరమవుతారు. పెళ్లి తరువాత కూడా సమంత అంతకు మించిన స్పీడుతో సెలక్టివ్‌గా వైవిధ్యభరతమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది. డిటిజల్‌ రంగంలో యాంకర్‌గాను అదరగొడుతుంది ఈ బ్యూటీ.

samantha

తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఆమె ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఆమె ప్రముఖ పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 అనే వెబ్‌ సిరీస్‌ త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఇదిలా వుంటే గుణశేఖర్‌ డైరెక్షన్‌లో పీరియాడికల్‌ మూవీ శాంకుతలంలో సినిమాలో నటిస్తోంది. ఇందులో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కింగ్‌ దుష్యంతుని పాత్ర పోషిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu