‘అమ్మడు’ కుమ్మేస్తోంది!

చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా పెద్ద హిట్. ఈ సినిమాలో చిరు, కాజల్ మధ్య చిత్రీకరించిన ‘అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ’ అనే పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మాస్ ఆడియన్స్, యూత్ లో ఈ పాట బాగా పాపులర్ అయింది. ఈ పాటలో రామ్ చరణ్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసింది. ఆ ఒక్క సీన్ కోసం సినిమాను పలుమార్లు చూసిన అభిమానులు చాలా
మంది ఉన్నారు.

తాజాగా ఈ పాట వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు. టిసిరీస్ చానల్ లో ఉన్న ఈ పాటకి ఇప్పటివరకు కోటి వ్యూస్ లభించాయి దీన్ని బట్టి ఈ సాంగ్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. చిరు స్టెప్స్, కాజల్ గ్లామర్, చరణ్ స్పెషల్ అప్పియరన్స్, దేవిశ్రీ బాణీలు ఈ పాటకు ఇంతటి ఆదరణను తెచ్చిపెట్టాయని చెప్పుకుంటున్నారు. మొత్తానికి యూట్యూబ్ లో కూడా అమ్మడు ఓ రేంజ్ లో కుమ్మేస్తోంది.