HomeTelugu Newsబాలీవుడ్‌కు సమంత, నాగచైతన్య..!

బాలీవుడ్‌కు సమంత, నాగచైతన్య..!

14 4

టాలీవుడ్‌ యువ జంట అక్కినేని నాగ చైతన్య, సమంత.. వీళ్లిద్దరు పెళ్లైన తర్వాత జంటగా నటించిన ‘మజిలీ’. ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్నే సాధించింది. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లోనే మంచి వసూళ్లను సాధించింది. దర్శకుడిగా శివ నిర్వాణ కూడా ఈ సినిమాను డీల్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు వెళుతుంది. ఇక హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయకుండా.. డైరెక్ట్‌గా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. హిందీలో కూడా ‘మజిలీ’ టైటిల్ అని కన్ఫామ్ చేసారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తికావొచ్చాయని సమాచారం. త్వరలోనే యూట్యూబ్‌లో కూడా ఈ సినిమా ప్రదర్శితం కానుంది.

సమంత హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘జాను’ విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఇంకోవైపు నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. పూర్తి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కోతున్న ఈ చిత్రంపై చాలానే అంచనాలే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu