‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ నుంచి.. వెన్నుపోటు, ఫస్ట్‌లుక్‌ డేట్‌ ఫిక్స్‌

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా భైరవ గీతతో నిర్మాతగా పరవాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నుపోటు పాటకు ప్రత్యేకంగా ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే వర్మ రిలీజ్ చేయబోయే పాటే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ సృష్టించిన వర్మ.. ఇప్పుడు వెన్నుపోటు పాట కోసం విడుదలచేస్తున్న పోస్టర్‌ను ఏ రేంజ్‌లో డిజైన్‌ చేశాడా అన్న ఆసక్తి నెలకొంది.