HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ భార్యపై సమంత హాట్‌ కామెంట్‌

అల్లు అర్జున్‌ భార్యపై సమంత హాట్‌ కామెంట్‌

samantha 1
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డికి సోషల్‌ మీడియాలో మాంచి ఫాలోయింగ్‌ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహరెడ్డి కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరలో స్నేహ ఎంతో అందంగా కనిపించారు.

సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ స్నేహకు స్టైలింగ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా పలువురు సెలబ్రిటీలు సైతం స్నేహపై ప్రశంసలు కురిపించారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత సైతం హాట్‌.. అంటూ కామెంట్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటమ్‌ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu