HomeTelugu Trendingచాలా రోజుల తరువాత కెమెరాకు చిక్కిన 'సమంత'

చాలా రోజుల తరువాత కెమెరాకు చిక్కిన ‘సమంత’

Samantha is back

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా కెమెరాకు చిక్కింది. మయో సైటిస్ తో బాధ పడుతున్న ఆమె చాలా నెలలుగా పూర్తిగా ఇంటికి లేదా హాస్పిటల్ కు మాత్రమే పరిమితం అయ్యింది. ఇటీవలే ఆమె ముంబయి ఎయిర్ పోర్ట్ లో సందడి చేసింది. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవలే సమంత మళ్లీ షూటింగ్ లకు హాజరు కాబోతుందనే వార్తలు వచ్చాయి. ఇంతలోనే ముంబయిలో సమంత ప్రత్యక్షం అవ్వడంతో ఆమె కెమెరా ముందుకు వచ్చేందుకే అంటూ మీడియా టాక్. ఈ క్రమంలో సమంత మొహంలో మునుపటి కల లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇన్నాళ్లు మీడియా కు దూరంగా ఉన్న సమంత ఇప్పటికి అయినా కెమెరా ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది.

సమంత ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఖుషి, హిందీలో రాజ్ అండ్ డీకే ల వెబ్ సిరీస్ లో నటించడంతో పాటు వరుణ్ దావన్ తో ఒక సినిమాను కమిట్ అయ్యింది. ఆమె నటించిన శాకుంతలం సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu