HomeTelugu Trendingమీరు వయస్సును కూడా ఓడించారు మామా: సమంత

మీరు వయస్సును కూడా ఓడించారు మామా: సమంత

2 28టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నాగార్జున నిన్న 60వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అక్కినేని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా నవ మన్మథుడు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇన్‌స్టా వేదికగా మామ నాగార్జునకు నిన్న శుభాకాంక్షలు తెలిపారు. నవ మన్మథుడిని పొగడ్తలతో ముంచెత్తారు. నాగార్జున స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మీతో పాటు మీపక్కన ఉన్నవాళ్లందరూ ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అది మీ గొప్పదనం. మీరు వయస్సును కూడా ఓడించారు మామా.. హ్యాపీ బర్త్‌డే కింగ్‌ నాగ్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. అంతేకాకుండా కుటుంబసభ్యులతో కలిసి దిగిన మరో ఫొటోను కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం నాగార్జున కుటుంబసభ్యులతో కలిసి స్పెయిన్‌లో ఉన్నారు. ఈ టూర్‌కి సంబంధించి సమంత ఇటీవల పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన మన్మథుడు-2 చిత్రం ఇటీవల విడుదలయ్యింది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించగా అన్నపూర్ణా స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్స్‌ పతాకంపై నాగార్జున, పి.కిరణ్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలో మెరిశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu