HomeTelugu Trendingసమంత ఒంటిపై నాగచైతన్య టాటూ మాయం

సమంత ఒంటిపై నాగచైతన్య టాటూ మాయం

samantha removes naga chait

సమంత -నాగచైతన్య జంట విడాకులు ఇప్పటికీ హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ సింగిల్‌ లైఫ్‌ను లీడ్‌ చేస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు.

అయితే, ఇప్పటికీ కొందరు ఈ జంట కలవాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా నాగచైతన్య సామంత ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ స్థాయి ప్రచారం జరుగుతోంది. పలు వెబ్‌సైట్లు కూడా వీరిద్దరూ కలుస్తున్నారా..? అంటూ వార్తలు రాశాయి. ఈ వార్తలపై సామ్‌ పరోక్షంగా స్పందించింది.

తాజాగా సమంత పింక్‌ శారీలో హాట్ హాట్ పోజులిస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సామ్‌ చాలా అందంగా కనిపించింది. అయితే ఈ ఫొటోల్లో సమంత హాట్ నెస్ కంటే ఆమె కుడివైపు రిబ్స్‌పై ఉండే టాటూ మాయమవడమే అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది. గతంలో సమంత తన కుడివైపు రిబ్స్‌పై చైతన్య ముద్దుపేరైన చై ని పచ్చబొట్టుగా వేయించుకుంది.

వీరు విడిపోయిన తర్వాత కూడా ఆ టాటూను సామ్‌ అలానే ఉంచుకుంది. కొద్ది రోజుల క్రితం షేర్‌ చేసిన ఫొటోల్లో కూడా ఆ టాటూ కనిపించింది. అయితే, తాజాగా షేర్‌ చేసిన ఫొటోల్లో మాత్రం ఆ పచ్చబొట్టు మాయమైపోయింది. ఈ ఒక్క ఫొటోతో రూమర్స్‌కు సమంత చెక్‌ పెట్టినట్లైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu