అలా అయితే నో అంటోన్న సమంతా!

దర్శకుడు నాగాశ్విన్ అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. నాగాశ్విన్ మావయ్య, అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యమీనన్ ను ఎన్నుకున్నారు. కొన్ని కారణాల వలన ఆమెను తప్పించి, ఆమె స్థానంలోకి సమంతను తీసుకున్నారు.

సమంతను తీసుకోవడం ద్వారా సినిమాలో మరో రెండు ముఖ్య పాత్రల కోసం నాగచైతన్య, ఎన్టీఆర్ లను ఒప్పించే అవకాశాలున్నాయని అశ్వనీదత్ ఆలోచించాడు. తాజాగా సమంత ఈ సినిమాకు నో చెబుతోందని ఫిల్మ్ నగర్ టాక్. అసలు విషయంలోకి వస్తే సావిత్రి కాస్త బొద్దుగా ఉంటుంది. కాబట్టి ఆ పాత్ర కోసం సమంతను బరువు పెరగమని నిర్మాత చెప్పినట్లు తెలుస్తోంది.

దానికి ఆమె అంగీకరించడం లేదని సమాచారం. సావిత్రి సినిమాలో నటించడానికి నేను సిద్ధమే.. కానీ బరువు పెరిగే ఆలోచన మాత్రం లేదని చెప్పేసిందట. ఖచ్చితంగా బరువు పెరగాలి అంటే మాత్రం తన వల్ల కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో దర్శకనిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో.. తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.