HomeTelugu Trendingసంపూర్ణేష్‌ బాబు న్యూమూవీ ఫస్ట్‌లుక్‌

సంపూర్ణేష్‌ బాబు న్యూమూవీ ఫస్ట్‌లుక్‌

Sampoornesh babu new movie

బ‌ర్నింగ్ స్టార్‌ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌నే తెచ్చుకుంది. తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో మ‌న ముందుకు వ‌స్తున్నాడు సంపూర్ణేష్‌ బాబు‌.

సంపూర్ణేష్, సంజోష్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘సోద‌రా’. ఇట్స్ ఏ బ్రోమాంటిక్ స్టోరీ అనేది ఉప శీర్షిక‌. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇక ఫ‌స్ట్ లుక్ గ‌మ‌నిస్తే.. సంపూర్ణేష్ బాబు, సంజోష్ పెళ్లి కొడుకు గెట‌ప్‌లో ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు ఉంది.

కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాకు మన్ మోహన్ మీనాంపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. CANS ఎంటర్‌టైన్‌మెంట్స్ & మాంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై చంద్ర చాగన్ల నిర్మిస్తున్నాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu