HomeTelugu Newsహార‌ర్ జోన‌ర్‌లో 'స్పిరిట్‌' .. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

హార‌ర్ జోన‌ర్‌లో ‘స్పిరిట్‌’ .. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

sandeep vanga revealed prab
పాన్‌ ఇండియా హీరో ప్ర‌భాస్, యానిమల్‌ దర్శకుడు సందీప్ వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ మూవీ చెయ్యనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో స్పిరిట్ ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వినిపించాయి. తాజాగా స్పిరిట్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను ఇచ్చాడు దర్శకుడు సందీప్ వంగా.

ఓ బాలీవుడ్ మూవీ టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ వంగా త‌న నెక్స్ట్ మూవీ ప్ర‌భాస్‌తోనే చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. స్పిరిట్ స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని సందీప్ వంగా తెలిపాడు. ఓ నిజాయతీగల పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌తో స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నాన‌ని చెప్పాడు. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు ఇది హార‌ర్ మూవీ కాద‌ని తెలిపాడు. స్పిరిట్ త‌ర్వాతే యానిమ‌ల్ సీక్వెల్ యానిమ‌ల్ పార్క్ ఉంటుంద‌ని సందీప్ వంగా పేర్కొన్నాడు.

స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని టీ సీరిస్ ప‌తాకంపై భూష‌ణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. యానిమ‌ల్ స‌క్సెస్‌తో స్పిరిట్‌పై ఇండియా వైడ్‌గా అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌న సినిమాలో హీరోను ఓ రెంజ్‌లో చూపించే సందీప్ వంగా స్పిరిట్‌లో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌ను ఎలా డిజైన్ చేస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu