క్రో మ్యాన్ ఫోటో షేర్‌ చేసిన అక్షయ్‌

‘2పాయింట్ 0’ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతున్నది. ఇప్పటికే భారీగా టికెట్స్ సేల్స్ జరిగాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీలోను భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నది ఈ సినిమా. ఇప్పుడు అందరి కళ్ళు 2పాయింట్ 0 లోని అక్షయ్ మేకప్ పైనే ఉన్నది. క్రో మ్యాన్ గా చేస్తున్న అక్షయ్ ఎలా మెప్పిస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మేకప్ పరంగా భయంకరంగా ఉన్న అక్షయ్, తన అభినయంతో ఆకట్టుకున్నాడని ఇప్పటికే దర్శకుడు శంకర్, హీరో రజినీకాంత్ చెప్పిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఓ ఫోటో ను షేర్ చేశాడు. క్రో మ్యాన్ గా అక్షయ్ విశ్వరూపం అది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.