HomeTelugu Big Stories'భోళా శంకర్‌' సెకండ్ సాంగ్ అప్డేట్

‘భోళా శంకర్‌’ సెకండ్ సాంగ్ అప్డేట్

Second single update from bమెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్‌లు, లిరికల్ సాంగ్‌లు మంచి హైపే వచ్చింది. అయితే ఇటీవలే రిలీజైన టీజర్‌ మాత్రం మెగా ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. మెహర్‌ రమేష్‌ వింటేజ్‌ బాస్‌ను చూపించే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటుంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని రెండో పాటకు సంబంధించిన మ్యూజికల్‌ అప్‌డేట్‌ను చిత్రబృందం వెల్లడించింది. జం జం జజ్జనక అంటూ సాగే సెలబ్రేషన్‌ సాంగ్‌ను మంగళవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రోమోను ఆదివారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన భోళా మేనియా ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. సిస్టర్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్‌ నటిస్తుంది. తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. మెహర్‌ రమేష్‌ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో మెగా ఫోన్‌ పట్టాడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌, క్రియేటీవ్‌ కమర్శియల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu