నంది అవార్డులపై బాలయ్య ‘నో కామెంట్’!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం కూడా బాలకృష్ణ దగ్గరుండి నిర్వహించారు. మురళీమోహన్ కూడా ఈ విషయంలో ఇన్వాల్స్ అయ్యారు. అయితే ఇప్పుడు నంది అవార్డులన్నీ బాలయ్యకు ఆయన
నటించిన ‘లెజెండ్’ సినిమాకు రావడంతో ఇప్పుడు విమర్శనాస్త్రాలు అన్నీ కూడా ఆయనపై దూసుకెల్తున్నాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా బాలయ్య ఒక ఎమ్మెల్యే కాబట్టి మరింత బాధ్యత తీసుకోవాలి.

కానీ అలా కాకుండా అవార్డుల విషయంలో బాలయ్య అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఆయన కనుసన్నల్లో జరిగిన అవార్డుఎంపికలో ఆయనకు అవార్డులు రావడంలో పెద్ద వింతేం ఉంది. ఈ విషయంపై బాలయ్యను ప్రశ్నించగా.. సింపుల్ గా నో కామెంట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయినా ఆయన మాత్రం ఏం చెప్తారు. సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు.