HomeTelugu Trending'సీతాయణం' టీజర్‌

‘సీతాయణం’ టీజర్‌

seethayanam movie teaser
“సీతాయణం” సినిమా ఫస్ట్‌లుక్‌ తోనే మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదలైంది. మాస్‌ మహారాజా రవితేజ ఈ టీజర్‌ను లాంఛ్‌ చేశారు. కన్నడ హీరో శశి కుమార్‌ తెలుగులో కూడా అందరికి సుపరిచితుడే. అమ్మలేని పుట్టిల్లు, బాషా, అశ్వనీ నాచప్ప సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పుడు ఆయన తనయుడు అక్షిత్‌ శశికుమార్‌ “సీతాయణం” అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కన్నడ, తెలుగులో విడుదల కానుంది. వైవీఎస్‌ చౌదరి, దశరథలాంటి దర్శకుల వద్ద శిష్యరికం చేసిన ప్రభాకర్‌ ఆరిపాక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కలర్‌ క్లౌడ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్స్‌పై లలిత రాజ్యలక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనహిత భూషణ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఫిక్స్‌ కాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu