HomeTelugu Trendingపొలిటికల్‌ టచ్‌తో ధనుష్‌- శేఖర్‌ కమ్ముల మూవీ!

పొలిటికల్‌ టచ్‌తో ధనుష్‌- శేఖర్‌ కమ్ముల మూవీ!

Sekhar kammula and dhanush

కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ధనుష్‌ నటిస్తున్న తొలి తెలుగు కావడం, అది కూడా శేఖర్‌ కమ్ముల డైరెక‌్షన్‌ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతుందట. పొలిటికల్‌ టచ్‌తో సినిమా ఉండనుందని తెలుస్తోంది. గతంలో రానాను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ శేఖర్ కమ్ముల ‘లీడర్‌’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రానాకు మంచి గుర్తింపు వచ్చింది. మరి ఈ సినిమా ధనుష్ కి కూడా ప్లస్‌ అవుతుంది అని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu