HomeTelugu Newsఅఖిల్‌ మూవీలో సీనియర్‌ హీరోయిన్‌..!

అఖిల్‌ మూవీలో సీనియర్‌ హీరోయిన్‌..!

మొదటి రెండు సినిమాలతో నిరాశపరిచిన అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ లాంటి బిగ్‌హిట్ సాదించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

5 12

ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. కాజల్‌ పాత్ర ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu