HomeTelugu Trendingతల్లి కాబోతున్న సీరియల్‌ నటి చైత్ర

తల్లి కాబోతున్న సీరియల్‌ నటి చైత్ర

Serial actress Chaitra beco

తెలుగు సీరియల్‌ నటి చైత్ర అష్టాచెమ్మా సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే అక్కాచెల్లెళ్లు సీరియల్‌ నుంచి మధ్యలోనే తప్పుకున్న నటి అభిమానులతో ఓ శుభవార్తను పంచుకుంది. తను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. “ఎప్పుడైనా సందిగ్ధంలో ఉంటే పిల్లలను ఎంచుకోంర్డి. కెరీర్‌, పని.. వంటివాటిని ఎంపిక చేసుకునేందుకు మున్ముందు బోలెడంత సమయం ఉంది. కుటుంబం అంటే ముఖ్యమైనదే కాదు సర్వస్వం కూడా! త్వరలో చిన్నారి చైత్ర ప్రసన్న మా ఇంట అడుగు పెట్టబోతోంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నేను, నా భర్త ప్రసన్నశెట్టి చాలా సంతోషిస్తున్నాం. మా జీవితంలో ఈ నూతన ఘట్టం మొదలు పెట్టడానికి మీ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలి. నేను నా లైఫ్‌లోనే అత్యంత అందమైన గొప్ప దశను ఆస్వాదిస్తున్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

ఈ మేరకు బేబీ బంప్‌ ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు చైత్ర సీరియల్స్‌కు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఇదన్నమాట అనుకుంటున్నారు. త్వరలో తల్లి కాబోతున్న చైత్రకు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu