HomeTelugu Trendingత‌న కారుతో బైక్ ఢీకొట్టిన బుల్లితెర న‌టి

త‌న కారుతో బైక్ ఢీకొట్టిన బుల్లితెర న‌టి

Serial actress lahari car h

ప్రముఖ సీరియల్‌ నటి లహరి కారు, బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లహరి కారు డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్నట్లు తెలిసింది.

ఘటన జరిగిన తరువాత లహరి కారు నుంచి బయటకు దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుని.. కార్‌తో పాటు లహరిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లహరి మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేశారు. అయితే ఆమె మద్యం సేవించలేదని తేలింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu