HomeTelugu Trending'కోయిలమ్మ' సీరియల్‌ నటుడుపై లైంగిక వేధింపులు కేసు

‘కోయిలమ్మ’ సీరియల్‌ నటుడుపై లైంగిక వేధింపులు కేసు

Sexual assault case filed o
‘​కోయిలమ్మ’ సీరియల్‌ నటుడు అమర్ శశాంక‌‌(సమీర్ క్యారెక్టర్‌‌)పై రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అమర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అమర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. కాగా.. అమర్‌ తమ వద్ద రూ. 5 లక్షలు తీసుకున్నాడని, ఆ డబ్బు అడిగినందుకు తాగి తమపై దాడి చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడంటూ బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక పోలీసు స్టేషన్‌లో కూడా అమర్‌ సదరు యువతిపై విచక్షణ రహితంగా దాడికి దిగుతూ పోలీసుల ఎదుటే హల్‌చల్‌ చేశాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అమర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన అమర్‌ .. నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అన్ని విష‌యాలు పోలీసుల ముందు చెబుతా. ఎవరికి సంజాయిషీ ఇచ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు అని అమర్‌ అన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu