Sharmila Funny Comments:
కొంతమంది రాజకీయ నాయకులు తెలిసి తెలియక మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతూ ఉంటాయి. ఈ విధంగానే వైయస్ షర్మిల మాట్లాడిన చాలా మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇప్పుడు వైయస్ షర్మిల మరొకసారి అలాంటి ఒక కామెంట్ చేసి మళ్లీ ట్రోల్స్ కి గురవుతున్నారు. ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వైయస్ షర్మిల “అందరికీ కామన్ సెన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను. కామన్ సెన్స్ ఈజ్ కామన్ ఫర్ ఎ రీజన్ బికాజ్ ఇట్స్ కామన్” అని షర్మిల చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
గతంలో కూడా వైయస్ షర్మిల చాలాసార్లు ఇలాంటి డైలాగులు వేశారు. ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకు అంటారు అంటే ఆడపిల్ల కాబట్టి అని.. మరొకసారి మీ ఆవిడని మీ ఆవిడ అని ఎందుకంటారు ఎందుకంటే మీ ఆవిడ కాబట్టి అంటూ రైమింగ్ తో వైయస్ షర్మిల చెప్పే డైలాగ్ లు చాలానే వైరల్ గా మారుతూ వచ్చాయి.
పాదయాత్ర గురించి కూడా ఒకసారి మాట్లాడుతూ పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రని చెప్పిన వైయస్ షర్మిల మరొకసారి కాంటెక్స్ట్ లో మాట్లాడండి కాంటెక్స్ట్ లో టెక్స్ట్ తీసేస్తే కాన్ మాత్రమే మిగులుతుంది అంటూ ఇలా చాలాసార్లు ఫన్నీ డైలాగులు వేశారు.
షర్మిల చాలా సీరియస్ గానే ఈ మాటలు చెప్పినా కూడా అవి సోషల్ మీడియాలో మాత్రం చాలా ఫన్నీ కామెంట్స్ గా ట్రోల్ అవుతూ ఉంటాయి.