HomeTelugu Newsఢిల్లీలో షారుక్ అరెస్ట్‌

ఢిల్లీలో షారుక్ అరెస్ట్‌

9 1
ఇటీవలే ఢిల్లీలో అల్లర్లు జరిగిన సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి తుపాకీతో 8 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ వ్యక్తి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతని పేరు షారుక్. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఫిబ్రవరి 24 వ తేదీన ఢిల్లీలోని జఫరాబాడ్, హౌజ్‌పూర్ ప్రాంతంలో కాల్పులు జరిపి పారిపోయిన ఆ వ్యక్తి 8 రోజుల తరువాత ఉత్తరప్రదేశ్ లోని షామిలీలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని పోలీసులు ఢిల్లీకి తరలించారు. ఫిబ్రవరి 24న జరిగిన అల్లర్లలో మొత్తం 47 మంది మృతి చెందగా 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయంపై 900 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, 254 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. రూ. కోట్లాది విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ఆందోళనకారులు ద్వంసం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu