HomeTelugu Trendingశర్వానంద్‌ కొత్త సినిమా లాంఛింగ్‌..

శర్వానంద్‌ కొత్త సినిమా లాంఛింగ్‌..

Sharwanand new movie pooja
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ‌ర్వానంద్‌.. ప్ర‌స్తుతం న‌టించిన ‘ఓకే ఒక జీవితం’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. శ్రీకార్తిక్ డైరెక్షన్‌లో వ‌హించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. తాజాగా శ‌ర్వానంద్ తదుపరి సినిమా లాంఛింగ్ కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో ఘనంగా జరిగాయి.

‘ఛ‌ల్ మోహన్‌రంగ’ ఫేం కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఈ చిత్రం పూజా కార్యక్ర‌మాలు గ్రాండ్‌గా జరిగాయి. త్రివిక్ర‌మ్ ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టాడు. ఈ కార్య‌క్రమానికి ద‌ర్శ‌కులు హ‌ను రాఘ‌వ‌పూడీ, చందూ మొండేటి, మారుతి, సుధీర్ వ‌ర్మ గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఈ చిత్రం శ‌ర్వాకు 33వ సినిమాగా తెర‌కెక్క‌నుంది. రూర‌ల్ బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో ఫుల్ రానెస్‌తో ఈ చిత్రం తెరకెక్క‌నుంద‌ట‌. ఈ మూవీలో శర్వా డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై విశ్య ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రాశీఖ‌న్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu