‘ఆర్ఆర్ఆర్’కు తప్పని హీరోయిన్ కష్టాలు.. ఆమే కూడా బిజీనే అంట!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కు హీరోయిన్ కష్టాలు తప్పడంలేదు. మొదట ఈ చిత్రంలో కథానాయికలుగా అలియాభట్, బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ అనుకున్నారు. కానీ డైసీ ఎడ్గర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలోకి బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ వస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన శ్రద్దా రాజమౌళి సినిమాలో నటించే వీలు లేదని తెలుస్తోంది. మరి జక్కన్న ఏ నటిని ఎంపిక చేస్తారో చూడాలి.