ఆయనతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది


సినీ ఇండస్ట్రీలో 19 ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి శ్రియ. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. పెళ్లి అయినా సినిమాలకు గుడ్‌బై చెప్పకుండా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఉంది. మంచి కథ ఉంటే సినిమాకు ఓకే అంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినిమాల్లోకి ఎలా వచ్చిందనే విషయాలు ముచ్చటించింది. నాగార్జునతో కలిసి సంతోషం సినిమాలో నటించడం తనకు మరిచిపోలేని జ్ఞాపకం అంటోంది. అప్పుడు నా వయసు చాలా తక్కువ అంది. నాగార్జునతో నటించడమంటే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది, ఆయనతో మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నా అంది. మన్మధుడితో కలిసి శ్రియ చివరగా మనం సినిమాలో నటించింది.

టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రియ శరన్ అంటే తెలియని తెలుగు ఆడియెన్స్ ఉండరు. కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వచ్చినంత క్రేజ్ మరెక్కడా రాలేదనే చెప్పాలి. గత 19 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ అప్పటికి ఇప్పటికి అదే తరహాలో మెరుస్తోంది. పెళ్ళైనా కానీ సినిమాలకు గుడ్ బై చెప్పకుండా.. అడపాదడపా వెండితెర పై మెరుస్తూనే ఉంది. మంచి స్క్రిప్ట్ ఉంటే.. సినిమాకు ఓకే చెప్తా అంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఒక డాన్స్ వీడియో చేయగా అందులో తనను చూసిన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇష్టం సినిమా కోసం తీసుకున్నారు. ఆ తర్వాతా వరుసగా ఆఫర్లు వచ్చాయని తెలిపిందిబీ. ఇక నాగార్జున తో కలిసి సంతోషం సినిమా చేసే టైంలో నా వయసు చాలా తక్కువ. అప్పటి జ్ఞాపకాలను నేను ఎప్పటికి మర్చి పోలేను. నాగార్జున గారితో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆయనతో ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించినా కూడా మరిన్ని సినిమాల్లో నటించాలని కోరకుంటున్నాను. నాగార్జునతో కలిసి నటించడానికి నేను ఎప్పుడు సిద్దమే అని గతంలో శ్రియ చెప్పుకొచ్చింది. నాగ్ తో కలిసి చివరిగా ఈ భామ ‘మనం’ సినిమాలో నటించింది.

CLICK HERE!! For the aha Latest Updates