HomeTelugu TrendingDevara: ఎన్టీఆర్ భార్యగా ఆ హీరోయిన్‌.. మరి జాన్వీ?

Devara: ఎన్టీఆర్ భార్యగా ఆ హీరోయిన్‌.. మరి జాన్వీ?

Shruti marathe as Devara wife

Shruti marathe as Devara wife: టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో జాన్వీకపూర్ కాకుండా మ‌రో కొత్త హీరోయిన్‌ న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరాఠీ హీరోయిన్‌ శృతి మరాటే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వినికిడి. తాజాగా ఈ వార్త‌ల‌పై శృతి మరాటే క్లారిటీ ఇచ్చింది. ఓ మరాఠీ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన శ్రుతి ఈ విషయం వెల్లడించింది.

Shruti marathe 1

మీరు తెలుగు సినిమా చేస్తున్న‌ట్లు తెలిసింది. దాని గురించి మాతో పంచుకోగలరా లేదా సీక్రెట్‌గా ఉంచుతారా అని యాంక‌ర్ అడిగింది. దీనికి శృతి స‌మాధానమిస్తూ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో తెలిసిపోయింది. నేను దేవ‌ర సినిమాలో న‌టిస్తున్నానని. ఈ చిత్రంలో నేను దేవ‌ర భార్యగా న‌టించ‌బోతున్నా. దీని కోసం చాలా ఆతృతగా ఎదురుచుస్తున్నా. ఈ చిత్రం అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుందంటూ వెల్ల‌డించింది. శృతి దేవర భార్యగా నటిస్తుంటే.. మరీ జాన్వీ ఏ పాత్రలో నటిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కళ్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu