HomeTelugu Big Storiesపాన్‌ ఇండియా మూవీగా సిల్క్‌ స్మిత బయోపిక్‌

పాన్‌ ఇండియా మూవీగా సిల్క్‌ స్మిత బయోపిక్‌

silk smitha the untold stor
80ల‌లో అగ్ర‌హీరోల‌తో క‌లిసి న‌టించి త‌న అందాల‌తో ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపింది సిల్క్‌ స్మిత. తన అందచందాలో కుర్ర‌కారు గుండెల్ని పిండేసింది. నేడు సిల్క్‌ స్మిత జయంతి. అయితే సిల్క్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్‌ ఇండియా స్థాయిలో మరో బయోపిక్‌ రానుంది.

చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంతో జయరామ్‌ అనే కొత్త దర్శకుడు ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అవుతున్నాడు. ‘సిల్క్‌ స్మిత ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా.. నేడు సిల్క్‌ స్మిత పుట్టినరోజు సంద‌ర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇందులో చంద్రిక.. స్మితలా కనిపించ‌నుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సిల్క్‌ స్మిత 1996 సెప్టెంబ‌ర్ 23న అనుమానాస్ప‌ద స్థితిలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఇక వెండితెర‌పై సిల్క్ స్మిత బ‌యోపిక్ ‘డర్టీ పిక్చర్‌’ రాగా విద్యాబాల‌న్ లీడ్ రోల్‌లో న‌టించింది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu