HomeTelugu Trendingబిగ్‌బాస్‌ హౌస్‌ నుండి సిరి ఎలిమినేట్‌

బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి సిరి ఎలిమినేట్‌

Siri eliminated from bigg b

తెలుగు బిగ్‌బాస్‌-5 రియాలిటీ షో మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆదివారం నాడు ఫినాలే జరగనున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ రేసులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో షణ్నూ, సన్నీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అఫీషియల్‌ పోలింగ్‌ ప్రకారం సన్నీ ముందంజలో ఉండగా, షణ్నూ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం సిరి, మానస్‌ల మధ్య పోటీ ఉందని తెలుస్తుంది. తాజాగా హౌస్‌ నుంచి సిరి ఎలిమినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం.. ఇంటి సభ్యులందరూ తమ బట్టలు సర్దుకుని గార్డెన్‌ ఏరియాకు రమ్మని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ‘ఈ ఇంట్లో మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది.

బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరని మీరు అనుకుంటున్నారు’ అని అడిగాడు. ‘నా అభిప్రాయం ప్రకారం షణ్ముఖ్‌ .. ఊహాగానాలు చాలా ఎక్కువ చేస్తున్నాడు’ అని మానస్‌ అనగా, మిగతా వాళ్లతో పెద్దగా గొడవలు కాలేదంటూ సన్నీ పేరును షణ్ముఖ్ సూచించాడు. ‘హౌస్‌మేట్స్‌ అనగానే ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్‌ ముఖ్యం. ఉన్న నలుగురిలో సిరితో నాకు ఇంటరాక్షన్‌ తక్కువ. కాబట్టి ఆమెనే అనుకుంటున్నా’ అని శ్రీరామ్‌ అన్నాడు. ఇక సన్నీ.. షణ్ముఖ్‌ పేరును సూచించాడు. అందరి అభిప్రాయాలు విన్న బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి ‘సిరి’ అని చెప్పాడు. దీంతో సిరి కంగుతింది. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లనని అంది. డోర్లు ఓపెన్‌ చేయడంతో సిరి, షణ్ముఖ్ బాధపడుతూ కనిపించారు. మరి సిరి నిజంగానే బయటకు వెళ్లిందా? లేదా ఏదైనా టాస్కా? సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారా? తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu