బాత్ టబ్‌లో కాజల్.. ఐస్ ముక్కలతో కప్పేసి ఫోటో వైరల్

టాలీవుడ్ చందమామ కాజల్ ‘సీత’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్‌ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బిజినెస్ ఉమెన్‌గా సీరియస్ పాత్రలో నటిస్తూ టీజర్‌తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇంత కంత్రీ పిల్లకు ఆ పేరు ఎలా పెట్టారా.. అన్నంత రేంజ్‌లో ‘సీత’ సూర్పణక అవతారం ఎత్తింది. ఎప్పటిలాగే హీరో బెల్లంకొండ పెర్ఫామెన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కాని.. సీత పాత్రలో కాజల్ అదరగొట్టింది. టైటిల్ రోల్‌కి న్యాయం చేసేట్టు ‘సీత’ కనిపిస్తుంది.

ఇక ఈ టీజర్‌లో బాత్ టబ్ నిండా ఐస్ క్యూబ్స్ నింపేసుకుని వాటిలో సేదతీరుతోంది కాజల్. ఈ అందాల ‘సీత’ ఐస్ క్యూబ్స్ తొట్టెలో ఎందుకు దిగాల్సి వచ్చిందో తెలియదు కాని.. బాత్ టబ్‌లో ఐస్ ముక్కలతో కూల్ అవుతున్న ఫొటో మాత్రం వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఫొటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి వేసవి తాపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది కాజల్.

CLICK HERE!! For the aha Latest Updates