HomeTelugu Big Storiesటైమ్స్ స్క్వేర్‌లో సితార

టైమ్స్ స్క్వేర్‌లో సితార

sitara first add pics on ne
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రికి తగ్గ కూతురుగా పేరుతెచ్చుకుంటుంది ఈ పాప. సోషల్‌ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక పీఎంజే జువెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సితార వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సితార చేస్తున్న తొలి యాడ్‌ను మూడు రోజులు షూట్‌ చేశారని సమాచారం.

ఈ నేపథ్యంలో సితార చేసిన తొలి కమర్షియల్‌ యాడ్‌ను ‘సితార కలెక్షన్స్‌’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ప్రఖ్యాత టైమ్‌ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లిటిల్‌ ప్రిన్సెస్‌ యాడ్‌ను టైమ్‌ స్వ్కేర్‌పై చూసి మహేశ్‌ అభిమానులు సంతోషపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu