Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమత్ర శిరొద్కర్‌ల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండిస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది.
చిన్న వయసులోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్, ప్రముఖ జువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సితార ఓ జువెల్లరి కంపెనీకి సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆమె కోటి రూపాయల పారితోషికం అందుకుంది. ఆ మొత్తాన్ని చారిటికి డోనేట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా సితార సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్స్‌ర్‌తో ముచ్చటించింది. ఈక్రమంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే ఇన్‌ఫ్లూయేన్స్‌ర్స్ అడిగా ప్రశ్నలన్నింటికీ కూల్‌గా సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా సితారకు తన తండ్రి మహేష్ నటించిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలో ఏవి ఇష్టం.. నటించాల్సి వస్తే ఏది సెలక్ట్ చేసుకుంటారనే ప్రశ్న ఎదురైంది. దీనికి సితార స్పందిస్తూ ఖలేజా సినిమాలో ఆయన చేసిన శివరామరాజు పాత్ర చేస్తానంటూ బదులిచ్చింది. ఇంకా మహేష్‌కి తన జుట్టు ముట్టుకుంటే నచ్చదంట.
తన తండ్రి, తల్లి కాకుండ ఇండస్ట్రీలో ఏ నటీనటులు అంటే ఇష్టమని అడగ్గా.. రష్మిక మందన్నా, శ్రీలీల అని చెప్పింది. అలాగే తన అన్నయ్య గౌతమ్ ఘట్టమనేని ఏదైనా తనకు హాని కలిగే విషయాలైతే అవి చేయకూడదని వారిస్తాడని, కానీ అల్లరి మాత్రం ఎక్కువ చేస్తాడని పేర్కొంది. ఆడపిల్లలకి, చిన్నపిల్లలకు చదువు చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఎందుకంటే నాకు చదవడం అంటే చాలా ఇష్టం అందుకే మిగతా పిల్లలు కూడా చదవాలనే ఉద్దేశంతోనే నేను కూడా చారిటీకి డబ్బులు డోనేట్ చేశానని చెప్పింది.
అన్ని విషయాల్లో తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని. తన తల్లి నుంచి ఫ్యాషన్ సెన్స్ ఇష్టమని, తన తండ్రి మహేష్ యాక్టింగ్ స్కిల్స్ ఇష్టమని తెలిపింది. ఇంత చిన్న వయసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్స్‌ర్ అవ్వడమనేది ఎంతవరకు కరెక్ట్, దీనికి ఏదైనా వయసు అనేది ఉండాలని మీరు అనుకుంటున్నారా? అని అడగ్గా.. అదేం లేదని, చిన్న వయసులోనే ఇన్‌ప్లూయేన్స్‌ర్ అవ్వడమనేది చాలా మంచి విషయమంది.
ఎందుకుంటే చిన్న వయసులోనే ఎంతో మంది స్ఫూర్తిగా నిలవడమనేది గొప్ప విషయమంటూ సితార చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఆరవ తరగతి చదువుతున్నానని, నెక్ట్స్ ఏడవ తరగతికి వెళ్తున్నట్టు చెప్పింది. ఇక చదువు అంటే ఇష్టమని చెప్పిన సితార గోల్ ఏంటనే ప్రశ్న ఎదురైంది. తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, తాను తప్పకుండ యాక్టర్ అవుతానంటూ చెప్పుకొచ్చింది.