HomeTelugu Trendingసల్మాన్‌ఖాన్‌పై గాయని సోనా విమర్శలు..!

సల్మాన్‌ఖాన్‌పై గాయని సోనా విమర్శలు..!

4 21
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై గాయని సోనా మహాపాత్ర తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్‌ఖాన్‌ది విషపూరిత స్వభావమని ఆరోపణలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ స్పందించిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఫ్యాన్స్‌కు తన అభిమానులందరూ అండగా ఉండాలని చెప్పిన సల్మాన్ వ్యాఖ్యలపై సోనా స్పందించింది. విషపూరిత స్వభావమున్న, పెద్ద హృదయం కలిగిన వ్యక్తి నుంచి ఓ పెద్ద కదలిక వచ్చిందని విమర్శించింది. సల్మాన్ డిజిటల్ పెయిడ్ ఆర్మీ గతంలో చాలామందిని బెదిరించారని, ఆ సమయంలో వాటిపై ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఆయన క్షమాపణ చెప్పడం కూడా అవసరమని ఆయన భావించలేదని ఆరోపించింది. గతంలో కూడా సల్మాన్‌పై ఇలానే సోనా తీవ్ర ఆరోపణలు చేసింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu