HomeTelugu Trendingక్యాన్సర్‌ రోజులు గుర్తు చేసుకున్న సోనాలి బింద్రే

క్యాన్సర్‌ రోజులు గుర్తు చేసుకున్న సోనాలి బింద్రే

Sonali bendre remember her

బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన ప‌డి కోలుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె కోలుకోవాలి అని అభిమానులు ప్రార్థనలు చేశారు. సినీ ప్రముఖులు సైతం ఆమె ఆరోగ్యం బాగు పడాలంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అందరి ప్రార్థనల ఫలంగా ఆమె కోలుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఆమె జీవనం సాగిస్తుంది. ఈ సమయంలో ఆమె షేర్ చేసిన ఈ ఫొటో అందరి కళ్లలో కన్నీరు పెట్టిస్తుంది.

తాజాగా అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫొటోను షేర్ చేసింది. ఆ సమయంలో సోనాలి పరిస్థితి ఎంత దారణంగా ఉందో ఈ ఫొటోను చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ ఫొటో తో సోనాలి.. కాలం ఎంతగా మారింది. నేను ఈ రోజు వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ సమయంలో నా బలహీనత కనిపిస్తుంది. సి పదం(క్యాన్సర్) తర్వాత నా జీవితం ఎలా ఉందనే విషయాన్ని నిర్వచించకూడదని భావించాను. మీ జీవితాన్ని మీరే ఎంపిక చేసుకోవాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీ జర్నీ కొనసాగుతుందని పోస్ట్ పెట్టింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. తెలుగులో మహేష్ బాబు మురారి, చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre)

Recent Articles English

Gallery

Recent Articles Telugu