HomeTelugu Trendingచిన్నారి ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్‌

చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్‌

Sonu sood helped a child he
బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఆయన సేవల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతోమందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించిన ఆయన ఇటీవల మరో చిన్నారికి గుండె ఆపరేషన్‌ చేయించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతుల కుమారుడికి పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. చికిత్సకి రూ. 6 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. తమకి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో చిన్నారిని కాపాడుకోలేకపోతున్నామని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న తిరువూరు (కృష్ణా జిల్లా) జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు. సోనూసూద్‌ వెంటనే స్పందించి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో ఆ చిన్నారి గుండెకి ఆపరేషన్‌ చేయించారు. శస్త్ర చికిత్స విజయవంతమైందని, బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులు సోనూసూద్‌ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu