HomeTelugu Big StoriesSouth Indian Movies 2024: ఈ సంవత్సరం సందడి చేయనున్న పెద్ద సినిమాలు

South Indian Movies 2024: ఈ సంవత్సరం సందడి చేయనున్న పెద్ద సినిమాలు

 

South indian movies South Indian Movies 2024,Pushpa,Devar,Indian-2,Game Changer,OG,Kalki

South Indian Movies 2024: ప్రతి ఏడాది సమ్మర్‌ వచ్చిందంటే చాలు వరుసగా సినిమాలు క్యూకడతాయి. సమ్మర్‌లో ఓ మాదిరి హిట్‌ టాక్‌ వచ్చినా చాలు.. మంచి కలెక్షన్స్‌ రాబడతాయి. కానీ ఈసారి ఇంకా ఆ సందడి కనిపించడం లేదు. మార్చి నెలలో విడుదలైన ‘టిల్లు స్క్వేర్‌’ హవానే నడుస్తుంది. ఇక దీనికి తోడు ఈ ఏడాది ఏపీలో ఎన్నికల కోలాహలం కూడా నడుస్తుంది. దీంతో ఈ సమ్మర్‌కు వచ్చే సినిమాలు తక్కువే అని చెప్పాలి. అయితే ఈ ఏడాది పలు స్టార్‌హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతున్నాయో చూద్దాం..

తంగలాన్: చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ సినిమా ‘మే’లో విడుదల కానున్నట్లు తెలుస్తుంది అయితే ఇంకా డేట్‌ ఫిక్స్‌ కాలేదు. కోలీవుడ్ డైరెక్టర్‌ పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో.. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ చాలా డిఫరెంట్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ అంచనాలను పెంచేశాయి.

pushpa 3 South Indian Movies 2024,Pushpa,Devar,Indian-2,Game Changer,OG,Kalki

కల్కి 2898 AD: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. మే 9న విడుదల కావాల్సిన ఈసినిమా జూన్ కి వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణెలతో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇండియన్ 2: ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్- కమల్ హాసన్ కాంబినేషన్‌ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. వీరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. ఈ మూవీ ప్రారంభం నుండి ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ వచ్చింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి చేశారనే తెలుస్తుంది. ఈక్రమంలో ఈ సినిమాని జూన్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

pushpa South Indian Movies 2024,Pushpa,Devar,Indian-2,Game Changer,OG,Kalki

పుష్ప-2: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. పుష్ప-1 సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన బన్నీ బర్త్‌డే స్పెషల్‌ టీజర్‌ కూడా ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో మాతంగి వేషంలో ఓ పట్టు చీర కట్టుకొని చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు అల్లుఅర్జున్‌. దీంతో ఈ సినిమాపై హోప్స్‌ మరింతగా పెరిగిపోయాయి.

ఓజీ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్ కాబింనేషన్‌లో వస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ మీద దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. కాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇంకా కొంచెం పెండింగ్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత ఈ మూవీ సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్ వస్తాడు. ఈ లోపు పవన్ కళ్యాణ్ లేని సీన్లను కూడా సుజిత్ తీసిన సంగతి తెలిసిందే.

og South Indian Movies 2024,Pushpa,Devar,Indian-2,Game Changer,OG,Kalki

గోట్‌: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకటేష్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ ఏడాది సెప్టెంబర్ 5న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

దేవర: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్‌ ఇండియా మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తుంది. సైఫ్‌అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

pushpa 1 South Indian Movies 2024,Pushpa,Devar,Indian-2,Game Changer,OG,Kalki

వెట్టయాన్: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వెట్టయాన్’. రజినీకాంత్ 170వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

గేమ్ ఛేంజర్: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమాకి తమిళ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ లేదా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

pushpa 2 2 South Indian Movies 2024,Pushpa,Devar,Indian-2,Game Changer,OG,Kalki

ఇక వీటితో పాటు.. NBK109, సూర్య కంగువ.. కూడా అక్టోబర్‌ లేదా డిసెంబర్‌లో విడుదల కానున్నాయి. మమ్ముట్టి ‘టర్బో’ జూన్‌లో, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ జులైలో, శివన్న ‘మాఫ్టీ ప్రీక్వెల్’ ఆగస్టులో, అజిత్‌ కుమార్ ‘విడా ముయర్చి’ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా వీటి కొన్ని సినిమాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu