HomeTelugu Big Storiesశ్రీముఖికి సపోర్ట్‌ చేసిన హాట్‌ యాంకర్‌

శ్రీముఖికి సపోర్ట్‌ చేసిన హాట్‌ యాంకర్‌

6 19

తెలుగు ‘బిగ్‌బాస్‌-3’ షో 90 రోజులకు పైగా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే తొలి రెండు సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్ మాత్రం అంతగా విజయం సాధించలేదనే అనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు 14వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది బిగ్ బాస్ షో. ఇక ఈ సారి విన్నర్ శ్రీముఖి అవుతుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈమెపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంతగా ఉన్నాయో.. నెగిటివ్ కమెంట్స్ కూడా అంతేగా ఉన్నాయి.

మరీ ముఖ్యంగా శ్రీముఖి తనకు నచ్చినట్లుగా బిగ్ బాస్ హౌస్‌లో ఉంటుందని.. ఆమెకు సపోర్టుగా బిగ్‌బాస్ షో నడుస్తుందంటూ హిమజ లాంటి వాళ్లు బయటికి వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు శ్రీముఖికి బయటి నుంచి సపోర్ట్ ఎలా ఉందనేది అందర్లోనూ కనిపిస్తున్న ఆసక్తి. ప్రతీ వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, శ్రీముఖి మాత్రమే మిగిలారు. అందులో రాహుల్ ఇప్పటికే ఫైనల్ చేరిపోయాడు.

6a 1

ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ముందుగా వినిపిస్తున్న పేరు శివ జ్యోతి.. ఆ తర్వాత బాబా భాస్కర్. ఇప్పటికే అలీ రెజాకి సీరియల్ నటులంతా సపోర్ట్ ఇస్తుండగా.. శివజ్యోతికి బయటి నుంచి హిమజ ఆర్మీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. వరుణ్ సందేశ్‌కి కూడా పునర్నవి, వితికాలు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి మాత్రమే ఒంటరి అయిపోయింది. ఈమెకు కూడా ఇప్పుడు కొండంత అండ వచ్చేసింది. రష్మీ గౌతమ్ రూపంలో ఈమెకు సపోర్ట్ దొరికేసింది.

తనకు శ్రీముఖి గురించి అంతా తెలుసని.. ఆమె ఎలాంటి వ్యక్తో కూడా తనకు బాగా తెలుసు అంటుంది రష్మీ. శ్రీముఖిని తాను బిగ్ బాస్ విన్నర్‌గా చూడాలని ఉందని వీడియో చేసింది రష్మీ. జబర్దస్త్ యాంకర్ రూపంలో మంచి సపోర్ట్ రావడంతో శ్రీముఖి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌లో చాలా ప్రభావం చూపిస్తుందని.. అంతా ఆమెకు నచ్చినట్లుగా మార్చుకుంటుందని విమర్శలు వస్తున్న తరుణంలో ఆమెకు జబర్దస్త్ రష్మీ గౌతమ్ సపోర్ట్ దొరకడం నిజంగానే అదృష్టం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu